ముంబై: రిజర్వ్ బ్యాంక్ అనుమతిపొందిన డిజిటల్ లెండింగ్ యాప్స్ మాత్రమే ఉండాలని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ (మెయిటీ) యాప్ స్టోర్లను కోరినట్లు ఫైనాన్స్ మినిస్ట్రీ పార్లమెంట్‌కు మంగళవారం తెలియచేసింది. చైనా లింకులతో నడుపుతున్న 58 యాప్స్‌ను మెయిటీ గుర్తించింది. దీంతో వాటిని బ్లాక్ చేయాలని యాప్ స్టోర్లను ఆదేశించింది. ఆర్బీఐ అనుమతి లేని యాప్స్‌ను యాప్స్టోర్ల నుంచి తొలగించాలని కూడా సూచించింది. ఈ ఆదేశాలను గూగుల్ రివ్యూ చేస్తున్నట్లు సమాచారం.
మనీలాండరింగ్‌కు అవకాశం లేని విధంగా యాప్స్ ఉండాలని, కస్టమర్ల ఐడెంటిఫికేషన్ కోసం కొన్ని పద్ధతులు పాటించాలని కూడా బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కు రిజర్వ్ బ్యాంక్ సూచించినట్లు ఫైనాన్స్ మినిస్ట్రీ పార్లమెంట్లో తెలిపింది. అకౌంట్ల ఓపెన్‌తోపాటు, వాటిని మానిటరింగ్ కూడా చేయాలని ఆర్బీఐ బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కు సలహా ఇచ్చినట్లు వెల్లడించింది. లోన్ సర్వీస్ ప్రొవైడర్ల డ్యూ డెలిజన్స్ కోసం సెప్టెంబర్ 2022 లోనే ఆర్బీఐ గైడ్‌లైన్స్‌ను జారీ చేసింది. లెండర్ బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా బారోవర్ అకౌంట్‌కి (మధ్యలో ఎలాంటి థర్డ్‌పార్టీ లేకుండా) చేరేలా రూల్స్ తీసుకొచ్చింది.
