Pakistan cricket: భారత మహిళతో పాకిస్థాన్ క్రికెటర్ వివాహం

పాకిస్తానీ క్రికెటర్ రజా హసన్ వచ్చే ఏడాది భారతీయ మహిళ పూజా బొమన్‌ను వివాహం చేసుకోనున్నారు. వచ్చే ఏడాది వివాహాన్ని నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. నివేదికల ప్రకారం జనవరి 2025లో వీరి వివాహం జరగనుంది. ఈ జంట ఇటీవల న్యూయార్క్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ ఫోటోలను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేశాడు. షోయబ్ మాలిక్, హసన్ అలీతో పాటు భారతీయ మహిళలను వివాహం చేసుకున్న పాకిస్తానీ క్రికెటర్ల జాబితాలో హసన్ రాజా చేరాడు. 

పెళ్లికి ముందే పూజ ఇస్లాంలోకి మారనుంది. పూజా హిందువు అయినప్పటికీ పెళ్లికి ముందే తన భర్త మతంలోకి మారుతుందని  నివేదికలు సూచిస్తున్నాయి. 32 ఏళ్ళ ఈ పాక్ క్రికెటర్ దేశం తరపున ఒక వన్డే, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.వన్డేల్లో ఒక వికెట్.. టీ20ల్లో10 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటికే పాకిస్థాన్‌ను విడిచిపెట్టి అమెరికా వెళ్లిన ఈ ఫాస్ట్ బౌలర్..  మా జీవితాల కొత్త ప్రయాణానికి సిద్ధంగా ఉన్నామని తన సోషల్ మీడియాలో రాశాడు.

ALSO READ | ENG vs PAK 1st Test: ఇది పిచ్ ఏంట్రా.. తారు రోడ్డు: ఇంగ్లండ్ - పాక్ తొలి టెస్టుపై నెట్టింట జోకులు

పూజా బోమన్ అనే భారత మహిళా వయస్సు ప్రస్తుతం 32 సంవత్సరాలు. ఆమె ప్రస్తుతం ఆమె యునైటెడ్ స్టేట్స్‌లో నివసిస్తోంది. సానియా మీర్జా,సమియా అర్జూ తర్వాత పాకిస్థాన్ క్రికెటర్ ను పెళ్లి చేసుకోబోతున్న మూడో మహిళా. ఇప్పటికే షోయబ్ మాలిక్.. ఏప్రిల్ 2010లో భారతదేశ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను వివాహం చేసుకున్నారు. పాకిస్థాన్ ఆల్ రౌండర్ హసన్ అలీ కూడా సమియా అర్జూ అనే భారతీయ బ్యూటీతో 2019లో వివాహం చేసుకున్నాడు.