రాయలగండి బ్రహ్మోత్సవాలు షురూ

అమ్రాబాద్, వెలుగు: పదర మండలంలోని రాయలగండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఆలయంలో వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం ధ్వజస్తంభ  ప్రతిష్ఠాపన అనంతరం చిట్లంకుంట గ్రామం నుంచి కల్యాణ ప్రతాణం నిర్వహించి స్వామి విగ్రహాలను, భజనలు, కోలాటాలతో ఊరేగింపుగా రాయలగండి క్షేత్రానికి తరలిస్తారు. ఎమ్మెల్యే చిక్కుడు అనురాధ, వంశీకృష్ణ దంపతులు హాజరు కానున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు.