Ravichandran Ashwin: మా నాన్నను క్షమించి ఒంటరిగా వదిలేయండి: అశ్విన్

టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం (డిసెంబర్ 13) బ్రిస్బేన్ టెస్ట్ అనంతరం ఈ 38 ఏళ్ళ స్పిన్నర్ అధికారికంగా వీడ్కోలు పలికాడు. సిరీస్ మధ్యలోనే అశ్విన్ తప్పుకోవడం పలు అనుమానాలను తావునిస్తుంది. దీనికి తోడు అశ్విన్ తండ్రి చేసిన ఆరోపణలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. తన కొడుకు రిటైర్మెంట్ బలవంతంగా జరిగిందని ఆయన ఆరోపించాడు. 

ALSO READ : IND vs AUS: ఓపెనర్‌పై వేటు.. టీమిండియాతో చివరి రెండు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

రిటైర్మెంట్ తర్వాత అశ్విన్ గురువారం (డిసెంబర్ 19) చెన్నై చేరుకున్నాడు. ఎయిర్ పోర్ట్ లో, ఇంటి దగ్గర అతనికి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా అశ్విన్ తో పాటు అతని తండ్రి మీడియాతో మాట్లాడారు. "అశ్విన్ ప్రకటించే వరకు రిటైర్మెంట్ గురించి నాకు కూడా తెలియదు. ఈ వార్త తెలియగానే నేను షాకయ్యాను. నా కుమారుడికి అవమానాలు ఎదురై ఉండొచ్చు. వాటిని భరించలేకే అతను రిటైర్మెంట్ ప్రకటించవచ్చు". అని సంచలన ఆరోపణలు చేశారు. అయితే అశ్విన్ మాత్రం తన తండ్రి మాటలను ఖండించాడు. 

Ashwin's father : "He couldn't bear the humiliation anymore".

- That is why communication is important, if BCCI & management wanted to move on from Ravi Ashwin. Then they should have given a proper farewell game in Chennai vs Ban at home & not like this".pic.twitter.com/UzE1Ikip4c

— Rajiv (@Rajiv1841) December 19, 2024

తన తండ్రి ఆరోపణలకు సోషల్ మీడియాలో క్షమాపణలు తెలిపాడు. "మీడియాతో ఎలా మాట్లాడాలనే విషయం మా నాన్నకు తెలియదు. ఆయనకు మీడియా ముందు మాట్లాడే  శిక్షణ లేదు. నాన్నా.. ఏంటిది? ఇలా డాడ్ స్టేట్‌మెంట్ ట్రెండ్‌ను నువ్వు కూడా అనుసరిస్తావని నేను అస్సలు ఊహించలేదు. అందరికీ నా విజ్ఞప్తి చేస్తున్నాను. మా నాన్నను క్షమించి ఒంటరిగా వదిలేయండి".అని అశ్విన్ ట్వీట్ చేశాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Cric Crak (@criccrak_)