IND vs NZ, 2nd Test: ఆసీస్ బౌలర్ వెనక్కి.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో అశ్విన్ టాప్

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భారత ఆఫ్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో రెండు వికెట్లు తీసి భారత్  కు మంచి ఆరంభం ఇచ్చాడు. దీంతో అశ్విన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ కు ముందు 187 వికెట్లతో ఆసీస్ స్పిన్నర్ టాప్ లో ఉన్నాడు. అయితే అశ్విన్ టామ్ లేతమ్, విల్ యంగ్ వికెట్లను తీసుకొని లియాన్ ను అధిగమించి అగ్ర స్థానానికి చేరుకున్నాడు. 

ఇన్నింగ్స్ 24 ఓవర్లో విల్ యంగ్ వికెట్ తీసుకొని అశ్విన్ ఈ ఘనతను సాధించాడు. 2019 నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రారంభం కాగా.. ఈ ఐదేళ్లలో అశ్విన్ 188 వికెట్లు పడగొట్టాడు. 187 వికెట్లతో లియాన్ రెండో స్థానంలో ఉండగా.. కమ్మిన్స్(175), స్టార్క్(147), బ్రాడ్(134) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ప్రస్తుతం అశ్విన్ టెస్ట్ కెరీర్ లో 530 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన వారై లిస్టులో లియాన్ తో కలిసి సంయుక్తంగా ఏడో స్థానంలో నిలిచాడు.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలి రోజు లంచ్ సమయానికి న్యూజి లాండ్ రెండు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. క్రీజ్ లో కాన్వే (47), రచీన్ రవీంద్ర (5) ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్ కు రెండు వికెట్లు దక్కాయి.  

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో అత్యధిక వికెట్లు  

రవిచంద్రన్ అశ్విన్ (భారత్) – 188*
నాథన్ లియోన్ (ఆస్ట్రేలియా) - 187
పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) – 175
మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) – 147
స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్) – 134
కగిసో రబడ (దక్షిణాఫ్రికా) – 132
జస్ప్రీత్ బుమ్రా (భారత్) – 124*
టిమ్ సౌటీ (న్యూజిలాండ్) – 120
జేమ్స్ అండర్సన్ (ఇంగ్లండ్) – 116
రవీంద్ర జడేజా (భారత్) – 114*