IND vs AUS: తేడా జరిగితే అతను సర్దుకోవడమే: తుది జట్టు నుంచి అశ్విన్, జడేజా ఔట్

టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్ వచ్చినప్పటి నుంచి భారత్ ఊహించని పరాజయాలు ఎదుర్కొంటుంది. ద్రవిడ్ హెడ్ పదవికి రాజీనామా చేసిన తర్వాత బీసీసీఐ గౌతమ్ గంభీర్ ను ప్రధాన కోచ్ గా నియమించింది. అనుభవం లేకోపోయినా బీసీసీఐ గంభీర్ ను గుడ్డిగా నమ్మినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ప్రధాన కోచ్ గా గంభీర్ కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. అతనికి నచ్చినట సహాయక కోచ్ లను నియమించింది. అయితే మూడు నెలలు గడిచేసరికి గంభీర్ కు అన్ని చేదు అనుభవాలే. అసలే తీవ్ర ఒత్తిడిలో ఉన్న గంభీర్ ఇప్పుడు భారత జట్టులో మరో కొత్త ప్రయోగం చేశాడు. 

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో ప్రారంభమైన తొలి టెస్టులో భారత జట్టు మొత్తం కుర్రాళ్లతో నిండిపోయింది. ఈ మ్యాచ్ లో సీనియర్ ఆల్ రౌండర్లు రవి చంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు తుది జట్టులో స్థానం దక్కపోవడం ఆశ్చర్యకరంగా అనిపించింది. ఆస్ట్రేలియా పిచ్ లపై సీనియర్లుగా వీరి అనుభవం ఎంతో కీలకం. ఆసీస్ పై  ఈ స్పిన్ ద్వయానికి అద్భుతమైన రికార్డ్ కూడా ఉంది. అయినప్పటికీ ఇద్దరినీ బెంచ్ కు పరిమితం చేశారు. వీరి స్థానాల్లో వాషింగ్ టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కింది. మరోవైపు ఆకాష్ దీప్ ను కాదని తుది జట్టులో హర్షిత్ రానాకు చోటు కల్పించాడు. 

Also Read:-నాటౌట్ అయినా ఔటిచ్చారు .. రాహుల్‌కు థర్డ్ అంపైర్ అన్యాయం

హర్షిత్ రానా ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కావడం వలనే అతనికి గంభీర్ కావాలని ఛాన్స్ ఇచ్చినట్టు నెటిజన్స్ విమర్శిస్తున్నారు. ఈ మ్యాచ్ భారత్ ఓడిపోతే గంభీర్ పై విమర్శలు రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇటీవలే న్యూజిలాండ్ తో జరిగిన సీరీస్ లోనూ గంభీర్ పిచ్చి ప్రయోగాలు విఫలమయ్యాయి. ఆస్ట్రేలియాలో జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భారత్ ఓడిపోతే గంభీర్ హెడ్ కోచ్ పదవి కోల్పోయే ప్రమాదం ఉంది. 

శ్రీలంకపై వన్డే సిరీస్ ను 0-2తో భారత జట్టు కోల్పోయింది. 28 ఏళ్ళ  తర్వాత భారత గడ్డపై లంక సిరీస్ గెలుచుకొని సంచలనం సృష్టించింది. ఒకరకంగా చెప్పాలంటే శ్రీలంక-బి జట్టుతో ఓడిపోయింది. తాజాగా స్వదేశంలో న్యూజిలాండ్ మూడు టెస్టుల సిరీస్ 0-3 తేడాతో వైట్ వాష్ అయింది. దీంతో గంభీర్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బీసీసీఐ సైతం గంభీర్ పై కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది. గంభీర్ తన సొంత నిర్ణయాలతో భారత జట్టుపై పనికి రాని ప్రయోగాలు చేస్తున్నాడని.. ఆస్ట్రేలియాలో జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అతనికి చివరిదని వార్తలు వస్తున్నాయి. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి రోజు లంచ్ సమయానికి మొదటి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. క్రీజ్ లో పంత్ (10), జురెల్ (4) ఉన్నారు. జైశ్వాల్ (0), పడికల్ (0), కోహ్లీ (5) విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజిల్‌వుడ్, స్టార్క్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.