సోషల్ మీడియా దుర్వినియోగాన్ని నిరోధించేందుకు కొత్త రూల్స్ తీసుకువచ్చామన్నారు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్. కేంద్ర ప్రభుత్వం విమర్శలను, ప్రశ్నలు అడిగే విధానాన్ని స్వాగతిస్తుందన్నారు. సాధారణ వినియోగదారుల హక్కులను కాపాడేందుకే ఈ రూల్స్ తెచ్చామని ట్వీట్ చేశారు. ప్రైవసీ రైట్ ను కేంద్రం గౌరవిస్తుందన్నారు. వాట్సాప్ వినియోగదారులు కొత్త నిబంధనల గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు. తప్పుడు సమాచారం ఎక్కడా నుంచి ప్రారంభమైనేది గుర్తించడమే రూల్స్ ఉద్దేశమన్నారు.
