IPL 2025 Mega Auction: మెగా ఆక్షన్ లో ఆ జట్టే మంచి ఆటగాళ్లను దక్కించుకుంది: రవి చంద్రన్ అశ్విన్

ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మొత్తం 19 మంది ప్లేయర్లను కొనుగులు చేసింది. వీరిలో స్టార్ ప్లేయర్లను ఆర్సీబి ఫ్రాంచైజీ కొనలేదని ఆ జట్టు ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. స్టార్క్, బట్లర్, షమీ, మిల్లర్, స్టోయినీస్, రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఆ జట్టులో కనిపించలేదు. దీంతో మరోసారి ఆర్సీబీ ఆక్షన్ లో పొరపాటు చేసిందని సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ వచ్చాయి. అయితే మెగా వేలంలో బెంగళూరు జట్టు ప్రదర్శనను టీమిండియా స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ ప్రశంసించాడు. 

ALSO READ : IPL 2025: అతడిని మిస్ అవుతున్నాం.. రూ.10 కోట్లు అయితే కొనేవాళ్ళం: లక్నో ఫ్రాంచైజీ

"రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు స్టార్ ప్లేయర్లపై దృష్టి పెట్టకుండా ఒక మంచి టీంను నిర్మించుకుంది. దీంతో ఆ జట్టు సమతుల్యతగా ఉంది". అని అశ్విన్ ఆర్సీబీ జట్టుపై రవి చంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. 2025 ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేయడం ఖాయమని.. కోహ్లీ కాకుండా వేరే వారిని కెప్టెన్ గా ఊహించుకోలేకపోతున్నానని ఈ మాజీ స్పిన్నర్ అన్నాడు. కాగా.. ఐప్లె మెగా వేలంలో అశ్విన్ ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 9 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. చివరి రెండు సీజన్ లలో రాజస్థాన్ రాయల్స్ తరపున అశ్విన్ ఆడాడు. 

ఆర్సీబీ కొనుగోలు చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా:

జోష్ హాజిల్‌వుడ్.. రూ.12.50 కోట్లు (ఆస్ట్రేలియా, బౌలర్)

ఫిల్ సాల్ట్.. రూ.11.50 కోట్లు (ఇంగ్లండ్, బ్యాటర్)

జితేష్ శర్మ.. రూ.11.00 కోట్లు (బ్యాటర్)

భువనేశ్వర్ కుమార్.. రూ.10.75 కోట్లు (బౌలర్)

లియామ్ లివింగ్‌స్టోన్ర్.. రూ.8.75 కోట్లు (ఇంగ్లండ్, ఆల్ రౌండర్)

రసిఖ్ సలామ్.. రూ.6. కోట్లు (బౌలర్)

కృనాల్ పాండ్యా.. రూ.5.75 కోట్లు (ఆల్ రౌండర్)

టిమ్ డేవిడ్.. రూ.3 కోట్లు (ఆస్ట్రేలియా, ఆల్ రౌండర్)

సుయాష్ శర్మ.. రూ.2.60 కోట్లు (బౌలర్)

జాకబ్ బెథెల్.. రూ.2.60 కోట్లు (ఇంగ్లండ్, ఆల్ రౌండర్)

దేవదత్ పడిక్కల్.. రూ.2 కోట్లు (బ్యాటర్)
    
నువాన్ తుషార.. రూ.1.60 కోట్లు (శ్రీలంక, బౌలర్)

రొమారియో షెపర్డ్.. రూ.1.50 కోట్లు (వెస్టిండీస్, ఆల్ రౌండర్)

స్వప్నిల్ సింగ్.. రూ.50 లక్షలు (ఆల్ రౌండర్)

స్వస్తిక్ చికారా.. రూ.30 లక్షలు (బ్యాటర్)  
  
మనోజ్ భాండాగే.. రూ.30 లక్షలు (ఆల్ రౌండర్)

మోహిత్ రతీ.. రూ.30 లక్షలు (బౌలర్)

అభినందన్ సింగ్.. రూ.30 లక్షలు (బౌలర్)

లుంగి ఎంగిడి.. రూ.1 కోటి (దక్షిణాఫ్రికా, బౌలర్)

ఆర్సీబీ రిటైన్ లిస్ట్:

విరాట్ కోహ్లీ.. రూ.21 కోట్లు (బ్యాటర్)

రజత్ పాటిదార్.. రూ.11 కోట్లు (బ్యాటర్)

యశ్ దయాల్.. రూ.5 కోట్లు (బౌలర్)