ఏపీ రాజకీయాల్లో కలకలం.. రేషన్ కార్డుపై జీసస్ ఫోటో

ఏపీ రాజకీయాల్లో కలకలం.. రేషన్ కార్డుపై జీసస్ ఫోటో

అమరావతి: రేషన్ కార్డుపై ప్రింట్ చేయబడిన ఏసుక్రీస్తు చిత్రం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో ఈ చిత్రం వైరల్ అవుతుండడంతో ప్రభుత్వమే ఈ పని చేసిందన్నట్టుగా నెటిజన్లు నుంచి పలు విమర్శలు వస్తున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం ఈ విషయాన్ని ఖండించింది, తెలుగు దేశం పార్టీకి చెందిన ఓ వ్యక్తే ఈ ప్రచారాన్ని కారణమని తెలిపింది.

దీనిపై అధికారికంగా ఓ ప్రకటన ఇస్తూ..” తూర్పు గోదావరి జిల్లా వడ్లమూరు గ్రామానికి చెందిన రేషన్ డీలర్ భర్తే ఇందుకు కారణమని, అతను టీడీపీ సభ్యుడు కావడంతో కావాలనే..  యేసుక్రీస్తు చిత్రాన్ని రేషన్ కార్డులలో ముద్రించాడని తెలిపింది. ఉద్దేశపూర్వకంగానే ఈ ఫోటోను ప్రచారం చేస్తున్నాడని, అతనేం మతమార్పిడి చేసుకున్న క్రిష్టియన్ కాదని, టీడీపీ కి డై హార్ట్ ఫ్యాన్ అని” ప్రభుత్వం తెలిపింది.

“ఇంతకుముందు, 2016 లో కూడా అదే వ్యక్తి రేషన్ కార్డులపై సాయి బాబా చిత్రాన్ని, 2017, 2018 లో లార్డ్ బాలాజీ ఫోటోను, 2019 లో జీసస్ క్రైస్ట్ చిత్రాన్ని ముద్రించాడు” అని ప్రభుత్వం తెలిపింది. ఈ సంఘటనపై సివిల్ సప్లయిస్ డిపార్ట్ మెంట్ అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు.