ఎలక్ట్రిక్‌ నానో కారులో టాటా

ఎలక్ట్రిక్‌ నానో కారులో టాటా

 ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా గ్యారేజీలోకి మరో కొత్త కారు వచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ ఎలక్ట్రా ఈవీ రూపొందించిన సరికొత్త 72వీ నానో  ఎలక్ట్రిక్ కారును రతన్ టాటాకు అందజేశారు. ఆయన  కోరిక మేరకు ఆయన అవసరాలకు తగ్గట్టుగా ఇటీవల కస్టమైజ్డ్‌ ఈవీ నానో కారును డెలివరీ చేసింది.

కొయంబత్తూరుకు చెందిన ఎలక్ట్రా ఈవీ కంపెనీ తాను అభివృద్ధి చెందిన ఎలక్ట్రిక్‌ వాహనాన్ని తన సంస్థ సహ యజమాని రతన్‌ టాటాకు అందజేసింది. ఈవీల పవర్‌ స్ట్రయిన్‌ సొల్యూషన్స్‌ను అందించే ఈ కంపెనీ నానో కార్లను రీ డైజన్‌ చేసి ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేస్తోంది. టాటా మోటార్స్ నుంచి నానోను కోయంబత్తూరు కంపెనీ కొనుగోలు చేసింది. ఈ కంపెనీకి రతన్‌ టాటా నిధులు సమకూర్చారు. కోయంబత్తూరు కంపెనీ అభివృద్ధి చేసిన 72వీ నానో విద్యుత్‌ కారు ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 160 కి.మీ. దూరం ప్రయాణం చేయొచ్చు. రతన్‌టాటా అతని సహాయకుడు శంతను నాయుడు ఈ కారులో ప్రయాణించారు.

మరిన్ని వార్తల కోసం..

ఆస్కార్ వేడుకకు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పని సరికాదు