అచ్చం హాలీవుడ్ హీరోలా ఉన్న ఆయన, రతన్ టాటా అంటే నమ్ముతారా? నమ్మితీరాల్సిందే.. ఎందుకంటే ఆయనే స్వయంగా ఇన్స్టాగ్రామ్లో ఆ ఫొటో పెట్టారు కాబట్టి. వయసులో ఉన్నప్పుడు లాస్ఏంజిలిస్లో తీసిన ఫొటోనట ఇది. ఇండియాకు వచ్చే కొద్ది రోజుల ముందే క్లిక్మనిపించారట. ‘త్రోబ్యాక్ థర్స్డే’ అంటూ ఆయన ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఆ ఫొటోకు నెటిజన్లు తెగ లైకులు కొట్టేస్తున్నారు. అచ్చం హాలీవుడ్ హీరోలా ఉన్నారంటూ పొగిడేస్తున్నారు. ఆ కళ్లలో ఓ మెరుపుందంటూ మెచ్చుకుంటున్నారు.
