IND vs BAN 2024: బంగ్లాతో సిరీస్ ఆపేయండి.. బీసీసీపై మండిపడ్డ ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు

బంగ్లాదేశ్‌లో హిందువులు మారణహోమానికి గురవుతున్న తరుణంలో బంగ్లాదేశ్‌తో క్రికెట్‌ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడడంపై.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సీనియర్ సిద్ధాంతకర్త రతన్ శారదా బీసీసీపై మండిపడ్డారు. హిందూ పోస్ట్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ఆయన గురువారం (సెప్టెంబర్ 19) చెన్నైలోని ఎంఏ రామస్వామి స్టేడియంలో ప్రారంభమైన మ్యాచ్‌ను రద్దు చేయాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు.

"షేక్ హసీనా ప్రభుత్వాన్ని తొలగించిన తర్వాత బంగ్లాదేశ్‌లో హిందువుల మారణహోమం జరుగుతున్నప్పుడు ఆ దేశంతో క్రికెట్ ఆడడం అవమానంతో కూడుకున్నది. అని ఆయన ప్రకటనలో తెలిపాడు. ఈ వీడియోలో జే షా ఫోటో ఉంది. "మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడాన్ని వ్యతిరేకిస్తూ ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడేందుకు ఆస్ట్రేలియా నిరాకరించింది. దక్షిణాఫ్రికా వర్ణవివక్ష విధానం కారణంగా 21 సంవత్సరాలు బహిష్కరించబడింది. అని రతన్ శారదా అన్నారు.

Also Read :- లంక మాజీ క్రికెటర్‌పై ఆస్ట్రేలియా క్రికెట్ 20 ఏళ్ళు నిషేధం  

"నేను బంగ్లాదేశ్ క్రికెట్ బహిష్కరణకు మద్దతు ఇస్తాను. మానవ సమస్యల నుంచి క్రీడలకు విడాకులు ఇవ్వలేము". అని ఆయన తెలిపారు. బంగ్లాదేశ్‌లో హిందువులను దారుణంగా ప్రవర్తించినప్పటికీ మ్యాచ్‌లను కొనసాగించాలన్న బీసీసీఐ నిర్ణయంపై సంఘ్ పరివార్‌లో విపరీతమైన ఆగ్రహం ఉంది. సెప్టెంబర్ 27 నుంచి బంగ్లాదేశ్ తో భారత్ రెండో టెస్ట్ ఆడనుంది. ఈ టెస్ట్ రద్దయినా పెద్దగా ఆశ్చర్యం లేదు అని నివేదికలు చెబుతున్నాయి. 

ఎవరీ రతన్ శారదా..? 

రతన్ శారదా చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ సభ్యుడు. అతను స్థానిక టీమ్ లీడర్ నుండి ముంబై స్థాయి వరకు వివిధ బాధ్యతలను నిర్వహించాడు, 5 సంవత్సరాలు సంఘచాలక్‌గా విభాగ్‌కు నాయకత్వం వహించాడు. అతను విశ్వ విద్యాన్ కేంద్రాన్ని (సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్) ముంబైని స్థాపించాడు. అతను ఫిల్మ్స్, కుకరీ నుండి మేనేజ్‌మెంట్ వరకు 12 పుస్తకాలు మరియు ఒక నవలకి సంపాదకత్వం వహించాడు. ప్రస్తుతం ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ మీడియా బృందంలో సభ్యుడు.