తాను రాష్ట్రపతిని కలిసి క్షమాపణలు చెబుతానని.. ఇతరులకు చెప్పనని బీజేపీ నేతలను ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యానించారు. రాష్ట్రపతిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఎంపీలు పార్లమెంటులో ఆందోళన చేపట్టాయి. దీంతో సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగింది. ఈ విషయంపై పార్లమెంట్ బయట అధిర్ రంజన్ మీడియాతో మాట్లాడారు. తనకు సమయం ఇవ్వాలని రాష్ట్రపతిని కోరాయని, సమయమిస్తే.. వెంటనే కలిసి క్షమాపణలు చెబుతానని స్పష్టం చేశారు.
తన నోటి నుంచి పొరపాటున వ్యాఖ్యలు దొర్లాయని.. ఇందుకు ఉరి కంబం ఎక్కడానికైనా సిద్ధమన్నారు. ‘‘నేను సమాధానం ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని స్పీకర్ ను లేఖ ద్వారా కోరాను. కానీ నా సమాధానం వినకుండానే బీజేపీ ఎంపీలు ఆందోళనలు చేస్తున్నారు’’ అని విమర్శించారు. అగ్నిపథ్, జీడీపీ తదితర విషయాలను పక్కదారి పట్టించేందుకు బీజేపీ నేతలు నాటకం ఆడుతున్నారని విమర్శించారు. గతంలో జరిగిన ఘటనలు గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. శశి థరూర్ భార్య, రేణుకా చౌదరి విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలిసిందేన్నారు. మోడీ హాయాంలో.. గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. సోనియా గాంధీ నేతృత్వంలో జల్, జంగల్, జమీన్ పై పెద్ద ఎత్తున పోరాటం చేశామని గుర్తు చేశారు.
#WATCH | "Rashtrapatni" row | ...I accepted my mistake...What do they say about Sonia Gandhi during polls? About Shashi Tharoor's wife? About Renuka Chowdhury? I sought time from President, might get appointment the day after tomorrow, I'll speak with her personally: AR Chowdhury pic.twitter.com/7W1PAw5JzG
— ANI (@ANI) July 28, 2022
