RWDY బ్రాండ్ రష్మిక: దేవరకొండ ఫ్యామిలీతో కలిసి పుష్ప 2 చూసిన రష్మిక.. ఫోటోలు వైరల్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించిన పుష్ప 2 (Pushpa 2) థియేటర్లో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో క‌లిసి రష్మిక గురువారం (డిసెంబర్ 5న) పుష్ప 2 మూవీని హైద‌రాబాద్‌లో చూసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోల్లో ర‌ష్మిక మంద‌న్న‌తో పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ త‌ల్లి మాధ‌వి, సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ ఉన్నారు. అయితే, విజ‌య్ మాత్రం క‌నిపించ‌లేదు. దాంతో విజయ్, రష్మిక మధ్య నడుస్తున్న సీక్రెట్ ప్రేమ ప్రచారం నిజమనేలా ఉంది.

అంతేకాదు.. విజయ్ దేవరకొండ రౌడీ బ్యాండ్ RWDY టీ షర్ట్ను రష్మిక ధరించింది. ఇది వారి మధ్య ఉన్న సంబంధంపై మరింత బలాన్ని ఇస్తోంది. ఇందులో రష్మిక మెరూన్ స్వెట్‌షర్ట్లో తెగ జోష్లో కనిపిస్తోంది. అయితే, వీరి మధ్య వస్తోన్న ప్రేమ పుకార్లకు ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు. 

ఇకపోతే పుష్ప 2 లో శ్రీవల్లీ గా నటించిన రష్మిక పాత్ర చాలా ఇంపాక్ట్ గా ఉంది. తన భర్త పుష్పరాజ్ బాధను, ఓ వైపు తనలోని సంఘ‌ర్ష‌ణ‌ను అర్థం చేసుకుంటూ అత‌డి ల‌క్ష్యానికి అండ‌గా నిల‌బ‌డే భార్య‌ పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం పుష్ప 2: ది రూల్ బాక్సాఫీస్ వద్ద లెక్కల తుఫానును కొనసాగిస్తోంది. ఇది ఇండియన్ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలవనుంది.