Vijay-Rashmika: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో విజయ్-రష్మిక.. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసమేనా!

ప్రస్తుతం టాలీవుడ్ రూమర్స్ లవ్ జంట ఎవ్వరో ఇట్టే తెలిసిపోతుంది. వారు సింగిల్ గా కనిపించిన లవ్ క్వశ్చన్స్, ఇద్దరు కలిసి కనిపించిన మ్యారేజ్ రూమర్స్ పేలుతుంటాయి. ఇప్పటికే అర్ధమై ఉంటుంది. వారే బ్యూటీఫుల్ స్టార్స్ విజయ్‌ దేవరకొండ - రష్మిక (Vijay-Rashmika). సోమవారం అర్థరాత్రి  డిసెంబర్ 23న వీరిద్దరూ కలిసి ముంబయి విమానాశ్రయంలో కనిపించారు. 

ముందుగా ముంబయి విమానాశ్రయానికి వచ్చిన రష్మిక  ఫొటోగ్రాఫర్లకు పోజులిచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికి విజయ్‌ దేవరకొండ కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే వారు అక్కడికి విడివిడిగా వచ్చినప్పటికీ డేటింగ్ రూమర్స్ మాత్రం మరోసారి తెరపైకి వచ్చాయి. వారు ఒకే విమానంలో ప్రయాణించడానికి వెళుతున్నట్లు టాక్.

అంతేకాకుండా క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి వెళుతున్నారని ఇరువురి ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. దీంతో వారి మధ్య ఉన్న లవ్ రూమర్స్ మరోసారి ఊపందుకున్నాయి. ప్రస్తుతం వీరిద్దరి ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గతంలో విజయ్ రష్మిక కలసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలసి నటించారు. ఈ క్రమంలోనే వీరిద్దరిమధ్య ప్రేమ చిగురించిందని అప్పటి నుంచి పర్సనల్ లైఫ్ లో చాలా క్లోజ్ గా ఉంటున్నారని, అంతేగాకుండా ఇరువురి ఇళ్ళలో జరిగే ఫంక్షన్స్ కి కుటుంబ సభ్యులు కూడా హాజరవుతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రష్మిక మందన పుష్ప 2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. హిందీ, తమిళ్, తెలుగు తదితర భాషలలో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలో హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సికిందర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే డైరక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న కుబేర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. వీటితో పాటు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో గర్ల్ ఫ్రెండ్ మూవీలో ఇంపాక్ట్ రోల్ ప్లే చేస్తోంది. 

ఇక విజయ్ దేవరకొండ విషయానికొస్తే.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD 12 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఇటీవలే శ్రీలంక షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇండియాకి వచ్చింది. అలాగే కల్కి 2, శ్యామ్ సింగరాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కుతోంది.  పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో విజయ్ యోధుడిగా కనిపిస్తాడని టాక్.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Snehkumar Zala (@snehzala)