Rashid Khan: కాబూల్‌లో గ్రాండ్‌గా రషీద్ ఖాన్ వివాహం

ఆఫ్ఘనిస్థాన్ స్టార్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ ఒక ఇంటి వాడయ్యాడు. కాబూల్‌లో అతను వివాహం  గ్రాండ్ గా జరిగింది. పష్తున్ ఆచారాల ప్రకారం తన వివాహాన్ని జరుపుకున్నాడు. రషీద్ పెళ్ళికి ఆఫ్ఘనిస్తాన్ జాతీయ జట్టు నుండి చాలా మంది క్రికెటర్లు హాజరయ్యారు. ఈ వివాహం ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. 

కాబూల్‌లోని ఇంపీరియల్ కాంటినెంటల్ హోటల్‌లో రషీద్ వివాహం జరిగింది. రషీద్ పెళ్లి జరిగిన హోటల్ బయట భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ తోటి క్రికెటర్లు తమ సోషల్ మీడియా ద్వారా రషీద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ కెప్టెన్ మహ్మద్ నబీ రషీద్ పెళ్లికి మొదటగా శుభాకాంక్షలు తెలిపాడు. ఆఫ్ఘనిస్తాన్ ఇటీవలే దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్ గెలవడంతో రషీద్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. 

రషీద్ ఖాన్ క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ తరఫున ఐదు టెస్టు మ్యాచ్‌ల్లో 34 వికెట్లు, 105 వన్డేల్లో 190 వికెట్లు తీశాడు. టీ20 ల్లో టాప్ బౌలర్ గా కొనసాగుతూ 93 మ్యాచుల్లో 152 వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్ ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నాడు.2025 ఐపీఎల్ లో అతన్ని గుజరాత్ రిటైన్ చేసుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది.