వావ్.. టైగర్స్ .. తల్లి పులితో పాటు ఐదు పులి పిల్లలు ఎదురొచ్చాయి !

ఆసిఫాబాద్/కాగజ్ నగర్, వెలుగు: అడవిలో పులిని డైరెక్ట్ గా చూస్తే.. ఆ ఫీలింగే వేరు. పెద్దపులితో పాటు పిల్లలు ఒకేసారి కనబడితే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. మహారాష్ర్టలోని చంద్రాపూర్ సమీపంలోని తాడోబా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పులులకు నిలయం.  ఇటీవల సఫారీ రైడ్ కి వెళ్లిన టూరిస్ట్ లకు అద్భుతమైన అనుభూతి దక్కింది. వాహనాల్లో వెళ్తుండగా తల్లి పులితో పాటు ఐదు పులి పిల్లలు ఎదురొచ్చాయి.

ఊహించని పరిణామంతో పర్యాటకులు ఆశ్చర్యానికి లోనై సెల్ ఫోన్లు, కెమెరాల్లో వాటిని బంధించారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలంగాణ– మహారాష్ట్ర బార్డర్ లో ఇటీవల పులుల సంచారం ఎక్కువైంది. వారం కిందట ఒక మేల్ టైగర్ ను  మహారాష్ట్ర ఫారెస్ట్ ఆఫీసర్లు బంధించినది తెలిసిందే. టైగర్ రిజర్వ్ లో సుమారు 50 వరకు పులులు ఉండొచ్చని అధికారుల అంచనా.