ఈ ఫొటో చూడండి. రెండు తెల్ల పిల్లులు ఆడుకుంటున్నట్టు కనిపిస్తోంది కదా. కానీ ఇవి తెల్ల పులి పిల్లలు. బెంగాల్ టైగర్ల వారసులు. ప్రస్తుతం ఆస్ట్రియాలోని కెర్నోఫ్‌లో వెయిసర్ జూలో ఉన్నాయి.
2019 మే 7న పుట్టాయి. నెల తర్వాత ప్రజలు చూసేందుకు బయటకు తీసుకొచ్చారు. పుట్టినపుడు ఒక్కొక్కటీ కిలో బరువున్నాయని, నెల తర్వాత 3.5 నుంచి 3.9 కిలోలకు పెరిగాయని సిబ్బంది చెప్పారు. ఏడాది వరకు తల్లి దగ్గరే ఉంటాయని, తర్వాత బయటకు తరలిస్తామన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2,500 కన్నా తక్కువే బెంగాల్ టైగర్లున్నాయని వరల్డ్ వైల్డ్ లైఫ్ వెల్లడించింది. ఇవి ఎక్కువగా ఇండియాలో ఉన్నాయి.
