- జీవితఖైదు వేసిన జడ్జి
- గుజరాత్ కోర్టులో ఘటన
సూరత్: ఐదేండ్ల చిన్నారిపై రేప్, మర్డర్ కేసులో నిందితుడికి జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పిన జడ్జిపైకి నిందితుడు షూ విసిరాడు. అయితే అది మిస్ అయ్యి పక్కనే ఉన్న విట్‌నెస్ బాక్స్ వద్ద పడింది. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్ కోర్టులో బుధవారం జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఒంటరిగా ఉన్న వలస కూలీ కూతురైన ఐదేండ్ల చిన్నారికి చాక్లెట్ ఇస్తానని చెప్పి నిందితుడు కిడ్నాప్ చేశాడు. ఎవరూ లేని ప్లేస్‌కి తీసుకెళ్లి రేప్ చేసి గొంతు కోసి చంపేశాడు. ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన 27 ఏండ్ల సుజిత్ సాకేత్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 26 మంది సాక్షుల వాంగ్మూలాలను, 53 డాక్యుమెంటరీ సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకున్న స్పెషల్ పోక్సో జడ్జి పీఎస్ కళ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
