అత్యాచారం కేసులో ఆశారాంకు మధ్యంతర బెయిల్

2013లో టీనేజ్ బాలికపై అత్యాచారం కేసులోఆశారాం బాబాకు బెయిల్ లభించింది. ఆనారోగ్యం కారణంగా వైద్యం కోసం బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ను ఆశ్రయిం చగా.. మంగళవారం (జనవరి 7,2025) విచారణ చేపట్టిన కోర్టు..ఆశారాం బాబాకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే మరో మహిళ అత్యాచారం కేసులో మధ్యంతర బెయిల్ పొందాల్సి ఉంగా.. అతను జైలులో ఉన్నారు. రాజస్థాన్లోని జోథ్పూర్ జైలు శిక్ష అనుభవిస్తున్న ఆశారాం..ఇటీవల వైద్యం కోసం 17 రోజులు పేరోల్ బెయిల్ లభించింది. పెరోల్ ముగిశాక తిరిగి జైలు కు వెళ్లిన వారంలోనే మరోసారి మధ్యంతర బెయిల్ లభించింది. 

జోధ్ పూర్ ఆశ్రమంలో మైనర్ పై జరిగిన అత్యాచారం కేసును విచారించిన జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ రాజేష్ బిందాల్ లతో కూడిన ధర్మాసనం.. ఆశారాం కు మార్చి 31 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే బెయిల్ పై విడుదలైన తర్వాత తన అనుచరులనుకలవకూడదని ఆదేశించింది. ఆశారాం ను ఆస్పత్రికి తరలించాలని, చికిత్సకోసం ఎక్కడికి వెళ్లాలో నిర్దేశించవద్దని పోలీసులను సుప్రీంకోర్టు ఆవేశించింది.

ఆశారాం రేప్ కేసు

2013లో జోధ్‌పూర్‌లోని తన జోధ్‌పూర్ ఆశ్రమంలో మైనర్‌పై అత్యాచారం చేసిన కేసులో దోషిగా ఆశారంను దోషిగా తేల్చింది కోర్టు. తర్వాత 2018లో జోధ్‌పూర్‌లోని కోర్టు ఆశారామ్‌కు జీవిత ఖైదు విధించింది. ఇదే కేసులో అతని ఇద్దరు సహచరులకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

ALSO READ | 5 గంటల్లో రెండోసారి భారీ భూ కంపం : ఈసారి టిబెట్ కేంద్రంగా ప్రకృతి బీభత్సం

2013లో గాంధీనగర్ సమీపంలోని ఆశ్రమంలో మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది. జీవిత ఖైదు విధించింది. 2013 అత్యాచారం కేసులో ట్రయల్ కోర్టు తనకు విధించిన జీవిత ఖైదును సస్పెండ్ చేయాలని కోరుతూ ఆశారాం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసుపై విచారణ ఇంకా కొనసాగుతోంది. 

ప్రస్తుతం ఆశారాం జీవిత నిషేధ పిటిషన్ సుప్రీకోర్టులో విచారణలో ఉంది. ఇటీవల వైద్యం కోసం 17 రోజులు పేరోల్ బెయిల్ లభించింది. పెరోల్ ముగిశాక తిరిగి జైలు కు వెళ్లిన వారంలోనే మరోసారి మధ్యంతర బెయిల్ లభించింది. ఆశారాం కు మార్చి 31 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే బెయిల్ పై విడుదలైన తర్వాత తన అనుచరులనుకలవకూడదని ఆదేశించింది.