Ranji Trophy Schedule Round1: ఇవాళ్టి(అక్టోబర్11)నుంచి రంజీట్రోఫీ

న్యూఢిల్లీ: ఈ సీజన్‌‌‌‌రంజీ ట్రోఫీ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి జరిగే తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌ మ్యాచు‌ల్లో సత్తా చాటాలని చాలా మంది యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్స్‌‌‌‌‌‌‌‌తో పాటు స్టార్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌, ఇషాన్‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. 2015–16 సీజన్‌‌‌‌‌‌‌‌లో 1321 రన్స్‌‌‌‌‌‌‌‌ చేసిన శ్రేయస్‌‌‌‌‌‌‌‌ మళ్లీ ఆ స్థాయిలో ఫామ్‌‌‌‌‌‌‌‌ను చూపెట్టాలని యోచిస్తున్నాడు. ఫలితంగా వన్డే ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో పదేపదే తనను పక్కనబెడుతున్న సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. 

అనివార్య కారణాలతో గత సీజన్‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉన్న ఇషాన్‌‌‌‌‌‌‌‌ కూడా ఇదే లక్ష్యంతో ఉన్నాడు. జార్ఖండ్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా కొత్త బాధ్యతలు స్వీకరించిన అతను భారీ స్థాయిలో రన్స్‌‌‌‌‌‌‌‌ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. కీపర్‌‌‌‌‌‌‌‌గానూ తన సత్తా చూపెట్టి ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌లోకి రావాలని భావిస్తున్నాడు. ప్రతి సీజన్‌‌‌‌‌‌‌‌లాగే ఈసారి కూడా 60 మంది ప్లేయర్లు రంజీలకు దూరం కానున్నారు. ఇందులో 17, 18 మంది టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు కూడా ఉన్నారు. 

వీళ్లంతా ఈ నెల 16 నుంచి జనవరి 7 వరకు టీమిండియా ఆడే ఎనిమిది టెస్ట్‌‌‌‌‌‌‌‌లకు అందుబాటులో ఉండనున్నారు. కాబట్టి ఈ 18 మంది ఒక్క రౌండ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు కూడా ఆడే చాన్స్‌‌‌‌‌‌‌‌ లేదు. మరో 15 మంది ఇండియా–ఎ టీమ్‌‌‌‌‌‌‌‌తో ఆసీస్‌‌‌‌‌‌‌‌, సౌతాఫ్రికా టూర్‌‌‌‌‌‌‌‌కు వెళ్లనున్నారు. మరో 15 మంది ఎమర్జింగ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ కోసం మస్కట్‌‌‌‌‌‌‌‌ వెళ్తున్నారు. ఈసారి అండర్‌‌‌‌‌‌‌‌–23 టీమ్‌‌‌‌‌‌‌‌ను ఏ టోర్నీకి పంపడం లేదు కాబట్టి కనీసం కొంత మందైనా అందుబాటులో ఉండనున్నారు. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ మెగా ఆక్షన్‌‌‌‌‌‌‌‌ కూడా ఉండటంతో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాలని యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్స్‌‌‌‌‌‌‌‌ భావిస్తున్నారు.