Ranji Trophy: పదికి పది వికెట్లు.. రంజీల్లో హర్యానా పేసర్‌ అరుదైన ఘనత‌‌‌‌‌‌‌

లాహ్లి: హర్యానా పేసర్‌‌‌‌‌‌‌‌ అన్షుల్‌‌‌‌‌‌‌‌ కాంబోజ్‌‌‌‌‌‌‌‌ (30.1–9–49–10) రంజీ ట్రోఫీలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. కేరళతో జరుగుతున్న మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఒకే ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 10 వికెట్లు తీశాడు. దీంతో రంజీల్లో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌‌‌‌‌‌‌‌గా చరిత్ర సృష్టించాడు.  ప్రేమాంగ్షు చటర్జీ, ప్రదీప్‌‌‌‌‌‌‌‌ సుందరమ్‌‌‌‌‌‌‌‌ ముందున్నారు. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా ఫస్ట్‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో పది వికెట్ల హాల్‌‌‌‌‌‌‌‌ సాధించిన ఆరో ఇండియన్‌‌‌‌‌‌‌‌ బౌలర్‌‌‌‌‌‌‌‌గా అన్షుల్‌‌‌‌‌‌‌‌ నిలిచాడు.  

ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌తో అన్షుల్‌‌‌‌‌‌‌‌ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో 50 వికెట్ల ఘనత (19 మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో) కూడా అందుకున్నాడు. అన్షుల్‌‌‌‌‌‌‌‌ పేస్‌‌‌‌‌‌‌‌ దాడికి కుదేలైన కేరళ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 116.1 ఓవర్లలో 291 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. రెండో రోజు ఎనిమిది వికెట్లు తీసిన అన్షుల్‌‌‌‌‌‌‌‌ శుక్రవారం మూడో రోజు బాసిల్‌‌‌‌‌‌‌‌ థంపి (4), షోన్‌‌‌‌‌‌‌‌ రోజెర్‌‌‌‌‌‌‌‌ (42)ను కూడా ఔట్‌‌‌‌‌‌‌‌ చేసి పది వికెట్ల ఫీట్‌‌‌‌‌‌‌‌ను ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన హర్యానా ఆట ముగిసే టైమ్‌‌‌‌‌‌‌‌కు తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 61 ఓవర్లలో 139/7 స్కోరు చేసింది. నిశాంత్‌‌‌‌‌‌‌‌ సింధు (29 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌), జయంత్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ (1 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు.