Ranji Trophy 2024-25: హిమతేజ సెంచరీ.. హైదరాబాద్‌‌‌‌ vs రాజస్తాన్‌‌‌‌ రంజీ మ్యాచ్‌‌‌‌ డ్రా

జైపూర్‌‌‌‌‌‌‌‌: కె. హిమతేజ (101 నాటౌట్‌‌‌‌) కెరీర్‌‌‌‌‌‌‌‌లో తొలి ఫస్ట్ క్లాస్ సెంచరీతో సత్తా చాటగా రాజస్తాన్‌‌‌‌తో రంజీ ట్రోఫీ నాలుగో రౌండ్ మ్యాచ్‌‌‌‌ను హైదరాబాద్ డ్రా చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రాజస్తాన్‌‌‌‌ మూడు పాయింట్లు దక్కించుకోగా.. హైదరాబాద్ ఒకే పాయింట్‌‌‌‌తో సరిపెట్టింది. చివరి రోజు, శనివారం ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 36/0తో  రెండో ఇన్నింగ్స్‌‌‌‌ కొనసాగించిన హైదరాబాద్‌‌‌‌ మ్యాచ్ చివరకు 65 ఓవర్లలో 273/3 స్కోరు చేసింది. 

ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (79), అభిరథ్ రెడ్డి (46) రాణించగా.. రోహిత్‌‌‌‌ రాయుడు (0) డకౌటయ్యాడు. తన్మయ్‌‌‌‌తో మూడో వికెట్‌‌‌‌కు 139 రన్స్‌‌‌‌ జోడించిన  హిమతేజ నాలుగో వికెట్‌‌‌‌కు కెప్టెన్ రాహుల్ సింగ్ (47 నాటౌట్‌‌‌‌)తో 77 రన్స్ జోడించాడు. తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌410 రన్స్‌‌‌‌ చేయగా.. రాజస్తాన్‌‌‌‌ 425 స్కోరు చేసింది.  నాలుగు మ్యాచ్‌‌‌‌ల్లో ఒక గెలుపు, రెండు ఓటములు, ఒక డ్రాతో హైదరాబాద్ 8 పాయింట్లతో  గ్రూప్‌‌‌‌–బిలో ఆరో స్థానంలో ఉంది. ఈనెల 13 నుంచి ఉప్పల్‌‌‌‌ స్టేడియంలో జరిగే తర్వాతి మ్యాచ్‌‌‌‌లో ఆంధ్ర జట్టుతో  తలపడనుంది.