Ranji Trophy 2024-25: రాజస్తాన్‌‌‌‌ 425 ఆలౌట్‌.. 21 పరుగుల ఆధిక్యంలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

జైపూర్‌‌‌‌: హైదరాబాద్‌తో రంజీ ట్రోఫీ ఎలైట్‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌–బి మ్యాచ్‌లో రాజస్తాన్‌‌‌‌‌ భారీ స్కోరు చేసింది. మహిపాల్‌ లోమ్రోర్‌(111), శుభమ్‌‌ గర్వాల్‌ (108) సెంచరీలతో చెలరేగడంతో.. 117/1 ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరుతో శుక్రవారం మూడో రోజు ఆట కొనసాగించిన రాజస్తాన్‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌ లో 108.2 ఓవర్లలో 425 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. దీంతో రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 15 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. 

అరాఫత్‌  ఖాన్‌ (32) ఫర్వాలేదనిపించాడు. తనయ్‌‌‌‌‌‌ త్యాగరాజన్‌3, మిలింద్‌,  రోహిత్‌‌‌‌ రాయుడు చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత రెండో  ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన హైదరాబాద్‌‌‌‌‌‌ఆట ముగిసే టైమ్‌‌‌‌‌కు 7 ఓవర్లలో 36/0 స్కోరు చేసింది. తన్మయ్‌ అగర్వాల్‌‌‌(8 బ్యాటింగ్‌), అభిరత్‌‌‌‌‌‌‌‌‌రెడ్డి (28 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు. మరో రోజు మిగిలున్న మ్యాచ్‌‌‌‌‌లో ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌21 రన్స్‌‌‌‌‌‌‌ఆధిక్యంలో కొనసాగుతోంది.