రంజీ ట్రోఫీ ఎలైట్‌‌‌‌‌‌‌‌: తొలిరోజే గుజరాత్‌‌‌‌‌‌‌‌ భారీ స్కోర్

సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌తో శుక్రవారం ప్రారంభమైన రంజీ ట్రోఫీ ఎలైట్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌–బి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో గుజరాత్‌‌‌‌‌‌‌‌ తొలి రోజే భారీ స్కోరు చేసింది. మనన్ హింగ్రాజియా (174 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) భారీ సెంచరీ సాధించడంతో.. టాస్‌‌‌‌‌‌‌‌ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన గుజరాత్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 86 ఓవర్లలో 334/8 స్కోరు చేసింది. ఆట ముగిసే టైమ్‌‌‌‌‌‌‌‌కు మనన్‌‌‌‌‌‌‌‌తో పాటు రింకేశ్‌‌‌‌‌‌‌‌ వాగేలా (24 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు.

ఆరంభంలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ బౌలర్లు చామ మిలింద్‌‌‌‌‌‌‌‌ (3/51), నిశాంత్‌‌‌‌‌‌‌‌ (2/46), తనయ్‌‌‌‌‌‌‌‌ త్యాగరాజన్‌‌‌‌‌‌‌‌ (2/62) కట్టుదిట్టంగా బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేసినా మధ్యలో పట్టు విడిచారు. దీంతో ఉర్విల్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ (60), మనన్‌‌‌‌‌‌‌‌ ఆరో వికెట్‌‌‌‌‌‌‌‌కు 112 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను నిలబెట్టారు. ఓపెనర్లు రిషి పటేల్‌‌‌‌‌‌‌‌ (0), ప్రియాంక్‌‌‌‌‌‌‌‌ పాంచల్‌‌‌‌‌‌‌‌ (15)తో పాటు సిద్ధార్థ్‌‌‌‌‌‌‌‌ దేశాయ్‌‌‌‌‌‌‌‌ (8), ఉమాంగ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ (28), జయమీత్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ (1), చింతన్‌‌‌‌‌‌‌‌ గాజా (0), ఆర్జాన్‌‌‌‌‌‌‌‌ (8) ఫెయిలయ్యారు. రక్షణ్‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఒక్క వికెట్‌‌‌‌‌‌‌‌ తీశాడు.