ధాన్యం సేకరణ, తరలింపులో లేట్ చేయొద్దు రంగారెడ్డి  జిల్లా కలెక్టర్ శశాంక

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు కల్పించాలని, రైతులకు వెంటనే టోకెన్లు జారీ చేయాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని, రైతులు తొందరపడి దళారులకు అమ్ముకోవద్దని సూచించారు. ధాన్యం సేకరణ, తరలింపులో జాప్యం చేయొద్దని స్పష్టంచేశారు. గురువారం అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాచారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు.

కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని రైతులను అడిగారు. ధాన్యానికి తరుగు ఏమైనా తీస్తున్నారా..? అని రైతులను ప్రశ్నించగా లేదని చెప్పారు.  ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియజేయాలని సూచించారు.  కలెక్టర్ వెంట డీసీవో ధాత్రి దేవి, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి మనోహర్ కుమార్ రాథోడ్, సివిల్ సప్లయ్ డీఎం విజయ లక్ష్మీ, అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్, అధికారులు ఉన్నారు. 

కొనుగోలు స్పీడ్ గా చేయండి 

ఘట్ కేసర్ : ధాన్యం కొనుగోలును స్పీడ్ గా చేపట్టాలని మేడ్చల్ అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి ఆదేశించారు. ఘట్ కేసర్ మండలం ఎదులాబాద్, మాధారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన సందర్శించారు.