వైభవంగా రంగనాథుడి రథోత్సవం

శ్రీరంగాపూర్, వెలుగు: శ్రీ రంగనాథ స్వామి రథోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఆలయంలోని గర్భగుడిలోని మూలవిరాట్​తో పాటు ఉత్సవ విగ్రహాలకు ఆలయ ధర్మకర్త రాజా కృష్ణదేవరాయలు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఏఐసీసీ కో ఆర్డినేటర్​ జిల్లెల ఆదిత్యా రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రాంజేంద్రప్రసాద్​ యాదవ్, భక్తులు, గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను రథంలో కొలువుతీర్చారు. భక్తులతో కలిసి రథాన్ని లాగి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ ప్రాంగణం రంగనాథస్వామి నామస్మరణతో మార్మోగింది.