రంగారెడ్డి జిల్లా విద్యార్థిని వరల్డ్ ​రికార్డ్

ఆమనగల్లు, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణానికి చెందిన గంజి వైష్ణవి వరల్డ్  రికార్డ్​ నమోదు చేసింది. 13 నిమిషాల్లో ప్రపంచంలోని అన్ని దేశాల పేర్లను రాసినందుకు గాను ఆమెను వరల్డ్  రికార్డ్​ఆఫ్ ఎక్స్ లెన్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్‎కు ఎంపిక చేశారు. పట్టణానికి చెందిన గణేశ్, హారిక దంపతుల కూతురైన వైష్ణవి పట్టణంలోని ప్రైవేట్​స్కూల్‎లో టెన్త్​ చదువుతోంది. ఆమెకు రంగారెడ్డి కలెక్టర్ శశాంక్ అవార్డును అందించి అభినందించారు.