రాంచీలో హింస.. ఓ తల్లి ఆవేదన 

రాంచీలో హింస.. ఓ తల్లి ఆవేదన 

మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేయాలని రాంచీలో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. ఇప్పుడే వస్తానని చెప్పిన కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలుసుకున్న ఓ తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. అతను చివరిసారి చేసిన ఫోన్ కాల్ ను గుర్తుకు తెచ్చుకుంటూ.. కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. మహ్మద్ ప్రవక్తపై సస్పెండ్ కు గురైన బీజేపీ నాయకులు నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాజధాని రాంచీలో జరిగిన నిరసనలు చెలరేగాయి. ఇద్దరు మరణించారు. అందులో 16 ఏళ్ల బాలుడున్నాడు. చివరిసారిగా కొడుకు చేసిన కాల్ ను గుర్తు పెట్టుకుని.. రోదిస్తోంది. కాల్ డిస్క్ కనెక్ట్ చేయండి.. ఇక్కడి నుంచి వస్తున్నా అని చెప్పినట్లు తెలిపింది. కొద్దిసేపటి అనంతరం కాల్పుల్లో చనిపోయాడని అతని స్నేహితుడు చెప్పాడని ఆవేదన వ్యక్తం చేసింది.

వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా అతను నినాదాలు చేయడం పలు వీడియోల్లో కనిపించింది. ఒక్కడే కొడుకున్నాడని వెల్లడించింది. నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. రాంచీలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. రాళ్లు రువ్వడం ప్రారంభించిన అనంతరం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి లాఠీఛార్జీ చేశారు. మరణించిన రెండో వ్యక్తి  సాహిల్ అన్సారీ (22). ఇతను హింస చెలరేగిన ప్రాంతానికి సమీపంలో పని చేసేవాడు. ఇంటికి బయలుదేరుతుండగా.. కాల్పుల్లో చనిపోయాడు. నేరుగా తుపాకీలను ఎలా ఉపయోగిస్తారని అతని కుటుంబం ప్రశ్నిస్తోంది. శాంతిగా ఉండాలని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ విజ్ఞప్తి చేశారు. జార్ఖండ్ ప్రజలు సున్నితంగా.. సహనంతో ఉంటారని, సామరస్యంగా మెలగాలని సూచించారు.