తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రానా

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రానా

తిరుమల శ్రీవారిని సినీ నటుడు రానా దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో రానా, సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు ఆశీర్వచనాలు చేశారు.  ఆలయ అర్చకులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. 

ఈక్రమంలో ఓ అభిమాని సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించగా.. రాణా అతడి ఫోన్ తీసుకొని గుడిలో ఇలాంటివి వద్దమ్మా అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అనంతరం అతనికి ఫోన్ తిరిగి ఇచ్చేశాడు.