రామేశ్వరం కేఫ్ పేలుడు.. అనుమానితుడి అరెస్టు

రామేశ్వరం కేఫ్  పేలుడు.. అనుమానితుడి అరెస్టు

 ఎన్ఐఏ అదుపులో నిందితుడి సహాయకుడు

బెంగళూరు: రామేశ్వరం కెఫె బాంబు పేలుళ్లకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ ఐఏ) తొలి అరెస్టు చేసింది. ప్రధాన నిందితుడికి సహకరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. బుధవారం ఉదయం బళ్లారిలో అతడిని అరెస్టు చేసింది. ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు అతడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. అరెస్టు అయిన వ్యక్తిని షబ్బీర్ గా గుర్తించారు. పేలుడు జరిగినప్పుడు ఎక్కడ ఉన్నాడనే వివరాలను రాబడుతున్నారు.

 బెంగళూరులోని రామేశ్వరం కెఫెలో ఈ నెల 1న బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఎన్ఐఏ ఈ నెల 3న ఈ కేసును విచారణకు చేపట్టింది. నిందితుడు ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైస్(ఐఈడీ)ని ఉపయోగించి పేలుడుకు పాల్పడినట్టు ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు.