Sai Pallavi: కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించిన నటి సాయి పల్లవి.. ఫోటోలు వైరల్

సహజ నటి సాయి పల్లవి (Sai Pallavi) వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించింది. అలాగే కాశీ అన్నపూర్ణ ఆలయాన్ని, గంగా హారతిని కూడా దర్శించుకుని భక్తితో సాయి పల్లవి నమస్కరించింది.

ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) తో కలిసి రామాయణ(Ramayana) చిత్రంలో నటిస్తోంది. ఈ సందర్భంగా సాయి పల్లవి వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ALSO READ | మోహన్ బాబు అరెస్ట్ కు లైన్ క్లియర్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్ తివారీ రామాయణ ఇతిహాసాన్ని తెరపై ఆవిష్కరించబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం భారతీయ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. లంకేశ్వరుడైన రావణుడిగా కేజీఎఫ్ స్టార్ యష్ (Yash) కనిపించనున్నాడు. ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగం థియేటర్స్ లోకి రానుంది. ఇకపోతే సాయిపల్లవి ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ మూవీలో నటిస్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sai Pallavi (@saipallavi.mh)

రామాయణ మూవీ చేస్తున్న కారణంగా సాయి పల్లవి వెజిటేరియన్గా మారిందంటూ ఇటీవలే  ఓ తమిళ వెబ్ సైట్లో కథనం వచ్చింది. దీనిపై తాజాగా తన ఎక్స్ అకౌంట్ ద్వారా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టింది. మరోసారి ఇలా తప్పుడు కథనాలు రాస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది తెలిసిందే.