Game Changer: అడ్వాన్స్ బుకింగ్స్లో దూసుకెళ్తోన్న గేమ్ ఛేంజర్.. అక్కడి థియేటర్లలో సోల్డ్ ఔట్ బోర్డ్స్

విజనరీ డైరెక్టర్ శంకర్(Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్(Game Changer)పై హైప్ రోజురోజుకి పెరుగుతోంది. ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్లో రామ్ చరణ్ (Ram Charan) తన నటనతో ఇచ్చిపడేసినట్లు తెలుస్తోంది. ఐఏఎస్ అధికారిగా ట్రేడ్‌మార్క్ స్టైల్‌లో, లీడర్ అప్పన్నగా గేమ్‌ఛేంజర్‌కి ప్రాణం పోశారని టాక్ వినిపిస్తోంది.

అయితే, గేమ్ ఛేంజర్ టికెట్ల కోసం ఓవర్సీస్ ఫ్యాన్స్ ఎగబడి కొనుగోలు చేస్తున్నారంట. ఎక్స్‌ట్రా ఫ్యాన్ షోలు అండ్ ప్రీమియర్‌లు మొత్తం బుక్ అవుతున్నట్లు మేకర్స్ తెలిపారు. "పారిస్, ఐర్లాండ్, లండన్, యూరప్.. లీసెస్టర్ మా గ్లోబల్ ర్యాంపేజ్ ని ఆపేది లేదు.. థియేటర్లు  బ్లాక్‌బస్టర్ రన్‌ను చూసేందుకు సిద్ధంగా ఉన్నాయి" అంటూ ట్యాగ్ ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే యూఎస్ మార్కెట్ లో కంటే యూకే మార్కెట్లో సెన్సేషనల్ బుకింగ్స్ కనిపిస్తున్నాయని అర్ధమవుతోంది.

ఈ మూవీ ఉత్తర అమెరికాలో రూ.3.6 కోట్లకు పైగా వసూలు చేసింది. జనవరి 3 నాటికి, ఈ సినిమా దాదాపు 1200 షోలలో 15,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఓవర్సీస్‌లో బాక్సాఫీస్ వద్ద రికార్డ్ క్రియేట్ చేస్తూ సినిమా థియేటర్లలోకి వచ్చే సమయానికి అడ్వాన్స్ బుకింగ్ స్పైక్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇకపోతే జనవరి 7 లేదా 8వ తేదీన తెలుగు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసే అవకాశం ఉంది.

ఇప్పటికే  గేమ్ ఛేంజర్ నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ కి భారీ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఇక మునుపెన్నడూ లేని విధంగా గేమ్ ఛేంజర్ ట్రైలర్ రెండ్రోజుల్లోనే 80 మిలియన్ వ్యూస్ తో అద్భుతమైన స్థాయిలో దూసుకెళ్తోంది.

ఈ సినిమాలో కియారా అడ్వాణీ హీరోయిన్‌. శ్రీకాంత్‌, అంజలి, నవీన్‌చంద్ర, సముద్రఖని, ఎస్‌.జె. సూర్య కీలక పాత్రలు పోషించారు. ఈ పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.