గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న అవైటెడ్ భారీ బడ్జెట్ మూవీ ‘పెద్ది’ (PEDDI). జాన్వీ కపూర్ హీరోయిన్గా.. శివరాజ్ కుమార్, జగపతిబాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ షాట్ తోనే భారీ అంచనాలు అందుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది.
ప్రస్తుతం ‘పెద్ది’ మూవీ షూటింగ్ షెడ్యూల్ సజావుగా జరుగుతోంది. ఇటీవలే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడంతో పాటు భారీ యాక్షన్ బ్లాక్‌ను పూర్తి చేశారు. ఇవన్నీ ఆకట్టుకునే విధంగా నిర్మించిన గ్రామీణ నేపథ్యంలో రూపొందించబడ్డాయి.
ఇప్పుడు, మేకర్స్ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లోకి అడుగుపెట్టింది. అక్కడ ఏర్పాటు చేసిన భారీ ట్రైన్ సెట్లో యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నట్లు సినీవర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. మానిటరీలో రామ్ చరణ్.. తనను తాను చూసుకుంటూ.. ఇంటెన్స్ గా ఫీల్ అవుతున్న ఫోటో ఆకట్టుకుంటోంది. రామ్ చరణ్ తన కళ్లలోని ఎమోషన్, నటనలోని ఇంటెన్స్ ను చూస్తూ కనిపిస్తున్నాడు.
►ALSO READ | తల్లీకూతుళ్లు అసల్ తగ్గేదేలే: స్టన్ అయ్యే స్టిల్స్‌తో సురేఖ వాణి, సుప్రీత.. ఫొటోలు వైరల్
భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకూ ఎవరూ చేయనటువంటి హైరిస్క్ యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫైట్ మాస్టర్ నభాకాంత్ నేతృత్వంలో ఈ మొత్తం ఎపిసోడ్ వేరే లెవెల్ లో ఉంటుందట. బిగ్ స్క్రీన్స్ పై ఈ సన్నివేశం ఆడియెన్స్ కి గట్టి ట్రీట్ ఇస్తుందని టాక్. గతంలో ఫైట్ మాస్టర్ నభాకాంత్ పుష్ప మూవీకి పనిచేశారు.
#PEDDI - A craziest & One of the Best Train Fight Sequence Loading..??
— ???????? ????? (@BheeshmaTalks) June 18, 2025
Global Star #RamCharan full efforts and display under the action choreography of #Nabakanth ( earlier worked for #Pushpa) pic.twitter.com/VOxgNKuS9C
ఈ ఏడాది చివర్లోగా ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలనే లక్ష్యంతో చరణ్, బుచ్చిబాబు ఉన్నట్టు సమాచారం. వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్న 'పెద్ది' మూవీని వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొ చ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
An Action Packed Schedule in full swing @AlwaysRamCharan sir ?❤️?@divyenndu bro ??#BTS #Peddi
— BuchiBabuSana (@BuchiBabuSana) May 22, 2025
GLOBAL RELEASE ON 27th March 2026? pic.twitter.com/mEyoyBQP6O
'పెద్ది' చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు. ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీని అందిస్తుండగా.. ఎఆర్ రెహమాన్ స్వరాలూ సమకూరుస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా పనిచేస్తున్నారు.
