GameChangerTrailer: న్యూఇయర్ వేళ.. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ట్రైలర్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?

రామ్ చరణ్-శంకర్ కాంబోలో వస్తోన్న ప్రెస్టీజియస్ మూవీ గేమ్ ఛేంజర్ (Game Changer). సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న రిలీజ్ కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇవాళ జనవరి 1 న్యూఇయర్ సందర్భంగా గేమ్ ఛేంజర్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

"అత్యంత ఎదురుచూస్తున్న గేమ్ ఛేంజర్ ట్రైలర్ ప్రకటన వచ్చేసింది. రేపు జనవరి 2న అందరికీ ట్రీట్ ఇవ్వడానికి రామ్ చరణ్ వస్తున్నాడు. సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు సిద్దంకండి" అంటూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ క్రేజీ అప్డేట్తో మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ కి భారీ స్పందన వచ్చింది.

Also Read : 2025లో టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులు ఇవే..

నిర్మాత దిల్ రాజు దాదాపు రూ.300-450 కోట్ల బడ్జెట్తో గేమ్ ఛేంజర్ నిర్మించినట్లు టాక్. ఇందులో ప్రమోషన్ ఖర్చులు, ఈవెంట్స్, రెమ్యునరేషన్, ప్రొడక్షన్స్ ఖర్చులు ఇలా అన్ని కలుపుకుని మొత్తం రూ.500కోట్ల బడ్జెట్ ని క్రాస్ చేసినట్లు తెలుస్తోంది.

గేమ్‌ ఛేంజర్‌ సినిమాని..ఎన్నో సూప‌ర్ డూప‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను రూపొందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ నిర్మిస్తోంది. రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో కనిపిస్తున్నాడు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా రానున్న ఈ సినిమాకు తమన్  (Thaman) సంగీతం అందిస్తున్నారు.