Video Viral: తండ్రి రామ్ చరణ్ని తొలిసారి టీవీలో చూస్తూ మెగా ప్రిన్సెస్ క్లీంకార కేరింతలు

మెగా ప్రిన్సెస్ క్లీంకార (Klin Kaara) వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రామ్ చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన (Upasana) తాజాగా (జనవరి 4న) క్లీంకార వీడియోని షేర్ చేసింది.

" తన తండ్రి రామ్ చరణ్ని తొలిసారి టీవీలో చూసి.. క్లీంకార ఎంతో ఆనందం వ్యక్తం చేసిందని" ఉపాసన తెలిపింది. ఇప్పుడు ఈ వీడియో మెగా ఫ్యాన్స్ను మాత్రమే కాకుండా నెటిజన్ల మదిని దోచేస్తుంది. అలాగే రామ్ చరణ్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.. ప్రపంచ వ్యాప్తంగా సినీ ఆడియన్స్ గేమ్ ఛేంజర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు" అంటూ ఉపాసన పేర్కొంది.

రామ్ చరణ్ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌’ ను టీవీలో చూస్తూ.. తన తండ్రి కనబడగానే కేరింతలు వేస్తూ క్లీంకార కనిపించింది. అలాగే స్క్రీన్ వైపే చూస్తూ.. మురిసిపోతూ ఎంతో ఆకట్టుకునేలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. ఈ వీడియో చూశాక ఒక తండ్రిగా చరణ్ ఆనందం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇది కదా కూతురికి నాన్న అంటే!

అయితే.. 2024 జూన్ 20న రామ్ చరణ్..ఉపాసన దంపతులకు క్లింకార జన్మించిన విషయం తెలిసిందే. చాలా కాలంగా ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్న మెగా కుటుంబంలో క్లింకార రాకతో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇక పాప పుట్టి 8 నెలలు గడుస్తున్నా..మీడియాకు మాత్రం పాపను చూపించలేదు మెగా ఫ్యామిలీ. దీంతో మెగా వారసురాలు ఎలా ఉందొ అని చూడటానికి మెగా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.