Ram Charan: అన్‌స్టాపబుల్‌ సెట్లో అడుగుపెట్టిన రామ్‌చ‌ర‌ణ్.. షో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ ప్రేక్షకులకి అన్‌స్టాపబుల్‌ షో స్పెషల్ సర్ప్రైజ్స్ తో దూసుకెళ్తోంది. సీజన్ 4 లో సినీ, రాజకీయ నాయకులతో బాలయ్య చేసే చిట్ చాట్ అద్దిరిపోతుంది. ఇటీవలే వెంకీ మామతో ముచ్చటించిన బాలయ్య నెక్స్ట్ ఎపిసోడ్లో రామ్ చరణ్తో హంగామా చేయనున్నాడు. 

లేటెస్ట్ ఎపిసోడ్ షూట్ను ఇవాళ మంగ‌ళ‌వారం (డిసెంబర్ 31న) మొదలెట్టింది ఆహా బృందం. అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్ జ‌రుగుతోంది. ఈ తాజా ఎపిసోడ్‌కు రామ్ చరణ్‌ హాజరయ్యారు. ఇప్ప‌టికే చ‌ర‌ణ్ షో వేదిక వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ ఇవాళ మంగళవారం మొదలై ఒకే రోజులో పూర్తీ కానుంది. సెట్ లో అడుపెట్టిన చరణ్ స్టైలిష్ లుక్ లో అద్దిరిపోయాడు.

ఈ సందర్భంగా చరణ్కు బాలయ్య వెల్కమ్ చెప్పారు. "సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ అలాగే గేమ్ ఛేంజర్ మూడూ సినిమాలు సూపర్ హిట్ కావాలి. ఇండస్ట్రీ ఎప్పుడు మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లాలి" అంటూ చరణ్కి గ్రాండ్ వెల్ కం చెప్పారు బాలకృష్ణ.

అయితే ఇప్పటివరకూ రామ్ చరణ్ ఇతర టాక్ షోలలో పాల్గొన్నప్పటికీ బాలయ్యతో కలసి మొదటిసారి అన్ స్టాపబుల్ షోలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు.  చ‌ర‌ణ్ కారు దిగి న‌డుచుకుంటూ వెలుతున్న ఫోటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ALSO READ : Best Actors of 21st Century: ఈ 21వ శతాబ్దంలో ఇండియాలో ఉన్న బెస్ట్ యాక్టర్ ఎవరో తెలుసా?

అయితే, గేమ్‌ ఛేంజర్‌ ప్రచారంలో భాగంగా రాబోయే ఎపిసోడ్ లో చరణ్ తో పాటు హీరోయిన్స్ కియారా,అంజలితో పాటు ప్రొడ్యూసర్ దిల్ రాజు, డైరెక్టర్ శంకర్ సైతం పాల్గొనబోతున్నట్లు సమాచారం. అయితే, బాలయ్య, చరణ్ల ఈ షో స్ట్రీమింగ్.. సంక్రాంతి కానుకగా శుక్రవారం జనవరి 10న రిలీజ్ చేసే అవకాశం ఉంది. 

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ముమ్మరం చేసింది.అంతేగాకుండా బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమాకూడా జనవరి 14న రిలీజ్ అవుతూ సంక్రాంతి బరిలో దిగనుంది. దీంతో అభిమానులు ఈ ఎపిసోడ్  గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.