క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) మరో సినిమాతో (RC 17)తో వస్తోన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అందుకు కారణం లేకపోలేదు.
సుకుమార్ పుష్ప 2తో నేషనల్ నుండి ఇంటర్నేషనల్ వైడ్గా తన సత్తా చూపించబోతున్నాడు. ఇక ఆల్రెడీ రామ్ చరణ్ RRR మూవీతో గ్లోబల్ స్టార్గా మారిపోయాడు. ఇవి సరిపోదా RC17 స్థాయిని పెంచడానికి!
అంతేకాదు..ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. అలాంటి కాంబో ఇప్పుడు మరోసారి రిపీట్ అవుతుండటంతో మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..RC17 లో ఓ టాప్ టాలెంటెడ్ బ్యూటీని రంగంలోకి దింపనున్నారట సుకుమార్. తన సహజమైన నటనతో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్ని చేసే హీరోయిన్ని పట్టుకొస్తున్నాడట. ఎవరో తెలుసా.. తనే మోస్ట్ వాంటెడ్ సాయి పల్లవి (Sai Pallavi).
డైరెక్టర్ సుకుమార్ సినిమాలలో హీరోయిన్స్కి బలమైన క్యారెక్టర్స్ డిజైన్ చేయడంలో సిద్ధహస్తుడు. ఇక ఈ సినిమాలో కూడా రామ్ చరణ్ కోసం సాయి పల్లవి అయితేనే బెస్ట్ ఇస్తుందని సెలెక్ట్ చేసాడట సుక్కు. ఇదే కనుక నిజమైతే మరో రంగస్థలమే!త్వరలో ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ALSO READ | KA OTT update: ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న కిరణ్ అబ్బవరం "క"... ఎప్పుడంటే.?
రామ్ చరణ్ విషయానికి వస్తే.. గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి బరిలో నిలిచింది. ప్రస్తుతం రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తో RC16 షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. ఈ సినిమా షూటింగ్ మైసూర్ లో జరుగుతోంది. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి కనీసం సంవత్సరమైనా పడుతుంది. దాంతో పాటు రామ్ చరణ్ RC17 లో కూడా ఛాన్స్ ఉంది.
Mighty forces reunite for an earth-shattering magnum opus ?❤?
— Mythri Movie Makers (@MythriOfficial) March 25, 2024
Global Star @AlwaysRamCharan X The Maverick Director @aryasukku X Rockstar @ThisisDSP X @MythriOfficial X @SukumarWritings = #Raring2Conquer ?#RC17 is all set to add new colours to the Indian Cinema ❤? pic.twitter.com/ISRZaumDng
సాయి పల్లవి విషయానికి వస్తే.. ఇటీవలే అమరన్ మూవీతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం నాగ చైతన్య తో తండేల్ మూవీలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో రామాయణ, అమీర్ ఖాన్ తనయుడితో ఒక మూవీ చేస్తోంది. మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.