రాజ్యసభ, లోక్ సభ టీవీ ఛానెళ్లను సంసద్ టీవీలో విలీనం చేశారు. రాజ్యసభ చైర్మన్, లోక్ సభ స్పీకర్ లు సంయుక్తంగా విలీన నిర్ణయం తీసుకున్నారు. అస్సాం -మేఘాలయ కేడర్ కు చెందిన రిటైర్డ్ IAS ఆఫీసర్ రవి కపూర్ ను CEOగా నియమించారు. ఒక ఏడాది పాటు కాంట్రాక్ట్ బేసిస్ లో CEOగా పనిచేస్తారు రవికపూర్. పార్లమెంట్ ను హిందీలో సంసద్ అని పిలుస్తారు. పార్లమెంట్ సెషన్ జరుగుతున్నప్పుడు రాజ్యసభ, లోక్ సభ వేర్వేరు లైవ్ టెలికాస్ట్ చేస్తారు. పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు… మాత్రం సంసద్ పేరుతో ఒకే ఛానెల్ నడుస్తుంది. 35 ప్రోగ్రామ్స్ ఉంటాయి. అయితే హింది, ఇంగ్లీష్ భాషల్లో సేమ్ కంటెంట్ తో ప్రోగ్రామ్స్ నడుస్తాయి.
