దేశ రక్షణ కోసం వెనకడుగు వేయబోం

దేశ రక్షణ కోసం వెనకడుగు వేయబోం

బెంగళూరు: సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశ ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి పూర్తి సన్నద్ధతతో ఉన్నామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. బార్డర్‌‌లో యథాతథ స్థితికి భంగం కలిగించేందుకు పలుమార్లు కొందరు యత్నించారంటూ చైనాపై రాజ్‌నాథ్ ఫైర్ అయ్యారు. భారత్ తన సరిహద్దులు, ప్రాదేశిక సమగ్రతను రక్షించుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకంజ వేయబోదని స్పష్టం చేశారు. బెంగళూరులో నిర్వహించిన ఎయిరో ఇండియా షోలో రాజ్‌‌నాథ్ పైవ్యాఖ్యలు చేశారు. మొత్తం మొత్తం ప్రపంచానికి ఉగ్రవాదంతో ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. భారత్ కూడా పలు వైపుల నుంచి సవాళ్లు, ప్రమాదాలను ఎదుర్కొంటోందన్నారు.