తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయా పార్టీ కసరత్తులు ముమ్మరం చేస్తున్నాయి. ఎన్నికల గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీలు పొత్తుకు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీ సైతం తాను స్థాపించబోయే పార్టీ విధివిధానాలను త్వరలో ప్రకటించనున్నారు. ఇప్పటికే పార్టీ పేరు, గుర్తులు ఇవేనంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా రజనీ పార్టీపై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్పుకోసమే మేమిద్దరం ఎప్పుడూ సిద్దమే. తమిళ ప్రజల కోసం కలిసి పనిచేస్తాం. పొత్తులు కొన్ని సార్లు విడిపోతాయి. మరికొన్ని సార్లు కొత్తవి పుట్టుకువస్తాయని కమల్ హాసన్ తెలిపారు.
