2020 వ సంవత్సరం అందరికీ అద్భుతమైన పాఠాలు నేర్పిందన్నారు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్. అనేక పరిక్షలు పెట్టి ఎన్నో పాఠాలు నేర్చుకునేలా చేసిందన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజేంద్ర ప్రసాద్ జీవితం అంటే ఏమిటో..ఎలా బ్రతకాలో ప్రజలందరికీ స్వామి వారు కరోనాతో తెలియజేశారన్నారు. కరోనాలో కూడా భక్తులు కోసం టిటిడి అద్భుతంగా ఏర్పాట్లు చేసిందన్నారు. పది రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరిచి ఉంచడం అందరి అదృష్టమన్నారు. ఎక్కువ మంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకునే అవకాశం టిటిడి కల్పించడం సంతోషమన్నారు. 2021 సంవత్సరంలో ప్రజలంతా నూతన జీవితంలోకి అడుగు పెట్టి సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. వచ్చే ఏడాది కొత్త సినిమాలతో అందరి ముందుకు రాబోతున్నానన్నారు.
భారీ భూకంపం..కుప్పకూలిన భవనాలు, ఏడుగురు మృతి
