రంగారెడ్డిలో గంజాయి స్మగ్లింగ్.. వేర్వేరు ప్రాంతాల్లో ఆరుగురు అరెస్టు

పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా.. తెలంగాణలో గంజాయి స్మగ్లింగ్ విచ్చల విడిగా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గంజాయి తరలిస్తున్న పట్టుబడుతున్నారు. ఫిబ్రవరి 26వ తేదీ సోమవారం అర్థరాత్రి రంగారెడ్డి జిల్లాలో గంజాయి తరలిస్తుూ పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర స్కూటీలో గంజాయి తరలిస్తుండగా ఎంఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి నాలుగు కేజీల స్వాధీనం చేసుకుని పోలీసులు..  నిందితుడిని.. శేర్ లింగంపల్లి ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు.  నిందితుడు అస్సాం రాష్ట్రానికి చెందిన అవినాష్ గా గుర్తించారు.  కాలేజీ యూత్ టార్గెట్ గా చేసుకుని నెంబర్ వన్ మాల్ అని అమ్ముతున్న నిందితుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ALSO READ :పథకాల అమలులో ఉద్యోగుల పాత్ర కీలకం : షబ్బీర్​అలీ

రాజేంద్రనగర్,  మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి స్మగ్లింగ్ గుట్టును రట్టు చేసిన రాజేంద్రనగర్ ఎస్ఓటీ బృందం.  చిన్న చిన్న ప్యాకెట్స్ లో గంజాయి ప్యాకింగ్ చేసి విక్రయిస్తుండగా ఐదగురు స్మగ్లర్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి  6 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. ఎన్ఎస్ డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.