IPL 2025: డుప్లెసిస్ ఔట్.. పటిదార్‌కు RCB పగ్గాలు..?

ఐపీఎల్ మెగా ఆక్షన్ 2025 కు ముందు అన్ని జట్లు తమ ప్లేయర్లను రిటైన్ చేసుకునే పనిలో ఉంది. ఇందులో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముగ్గురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే ఆలోచనలో ఉందట. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు రజత్ పటిదార్ బెంగళూరు జట్టుతోనే ఉంటారట. ఇక మూడో ప్లేయర్ గా ఇంగ్లాండ్ స్పిన్ ఆల్ ఆల్ రౌండర్ విల్ జాక్స్ కు అవకాశం దక్కనుందని సమాచారం. 

సూపర్ ఫామ్ లో ఉన్నప్పటికీ కెప్టెన్ డుప్లెసిస్ కు ఈ సారి నిరాశ తప్పేలా కనిపించడం లేదు. అతని కెప్టెన్సీలో ఆర్సీబీ అద్భుత విజయాలు సాధించినా టైటిల్ గెలవడంతో విఫలమైంది. దీంతో డుప్లెసిస్ స్థానంలో పటిదార్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొన్ని నివేదికలు సైతం పటిదార్ ను కెప్టెన్ గా చేస్తారంటూ తెలిపాయి. సూపర్ ఫామ్ లో ఉండడం యంగ్ ప్లేయర్ కావడంతో పటిదార్ ఆర్సీబీ కెప్టెన్సీ రేస్ లో ముందున్నాడు.      

ALSO READ | ENG vs SL 2024: స్పిన్నర్ అవతారమెత్తిన ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్

మరోవైపు ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ దారులు దాదాపుగా మూసుకుపోయినట్టే. మ్యాక్సీ ఆర్సీబీను అన్ ఫాలో చేసిన సంగతి తెలిసిందే. వెటరన్ ప్లేయర్ దినేష్ కార్తీక్ 2024 సీజన్ తర్వాత  ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. స్టార్ బౌలర్ సిరాజ్ సైతం ఈ సారి మెగా ఆక్షన్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆర్సీబీ కోహ్లీ, పటిదార్, విల్ జాక్స్ లను మాత్రమే రిటైన్  చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.      

2023 మినీ యాక్షన్ లో రూ.11 కోట్ల రూపాయలకు దక్కించుకున్న అల్జారీ జోసెఫ్ తో పాటు ట్రేడింగ్ ద్వారా రూ. 17 కోట్లకు దక్కించుకున్న ఆసీస్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ వేలంలోకి రానున్నారు. వీరిద్దరూ నాణ్యమైన ప్లేయర్లే అయినా.. అంత భారీ మొత్తంలో చెల్లించడానికి ఆర్సీబీ సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు 17 సీజన్ లు జరిగినా బెంగళూరు జట్టుకు ఒక్క టైటిల్ నెగ్గలేకపోయింది. 2024 ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆఫ్ కు అర్హత సాధించిన ఆర్సీబీ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది.