IPL Retention 2025: రాజస్థాన్ రిటైన్ లిస్ట్ రిలీజ్: బట్లర్‌కు బిగ్ షాక్.. శాంసన్, జైస్వాల్‌కు రూ.18 కోట్లు

ఐపీఎల్ 2025 ఆక్షన్ కు ముందు స్టార్ ప్లేయర్ ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కు రాజస్థాన్ రాయల్స్ షాక్ ఇచ్చింది. అతడిని రిటైన్ చేసుకోకుండా 2025 మెగా ఆక్షన్ లోకి వదిలేసింది. తాజాగా రాజస్థాన్ విడుదల చేసిన రిటైన్ ఆటగాళ్ల లిస్ట్ వచ్చేసింది. కెప్టెన్ సంజు శాంసన్ కు రూ. 18 కోట్లతో పాటు ఓపెనర్ యశస్వి జైస్వాల్ కు సైతం రూ. 18 కోట్లు ఇచ్చి టాప్ రిటైన్ ప్లేయర్లుగా తీసుకున్నారు.

 

యువ క్రికెటర్ రియాన్ పరాగ్, వికెట్ కీపర్ ధృవ్ జురెల్ ఇద్దరూ చెరో రూ. 14 కోట్ల రూపాయలు దక్కాయి. వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్  షిమ్రోన్ హెట్మెయర్ కు రూ. 11 కోట్ల రూపాయలు పెట్టి రిటైన్ చేసుకున్నారు. అన్ క్యాప్డ్ ప్లేయర్ గా సందీప్ శర్మకు రూ. 4 కోట్ల రూపాయలతో జట్టులో కొనసాగనున్నాడు. స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కు నిరాశ తప్పలేదు. రాజస్థాన్ మొత్తం రూ. 79 కోట్ల రూపాయలు ఖర్చు చేసినందున వారికి ఎలాంటి RTM కార్డు ఉపయోగించే అవకాశం లేదు. రూ. 41 కోట్లతో వారు మెగా వేలంలోకి అడుగుపెట్టనున్నారు.