రాజస్థాన్ సీఎంకు హైకోర్టు షోకాజ్ నోటీసులు

రాజస్థాన్ సీఎంకు హైకోర్టు షోకాజ్ నోటీసులు

కోర్టుల్లో అవినీతి పెరిగిపోయిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కు ఆ రాష్ట్ర హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.   మూడు వారాల్లో సమాధానం చెప్పాలని  ఆదేశించింది. గెహ్లాట్‌పై సుమోటో క్రిమినల్ ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిల్‌పై రాజస్థాన్ హైకోర్టు విచారణ జరిపిన కోర్టు నోటీసులు జారీ చేసింది. 

ఇటీవల జైపూర్ లో మీడియాతో  మాట్లాడిన గెహ్లాట్ ..  న్యాయ వ్యవస్థలో అవినీతి పెరిగిపోయిందన్నారు.  చాలా మందిలాయర్లు తీర్పును రెడీ చేసి కోర్టులకు అందిస్తున్నారని... అదే విధంగా జడ్జిమెంట్ వస్తోందని గెహ్లాట్ వ్యాఖ్యానించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తాను చెప్పింది తన వ్యక్తిగత అభిప్రాయం కాదని వివరణ ఇచ్చారు. తాను న్యాయవ్యవస్థను గౌరవిస్తానన్నారు.