రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ తన రెండు దశాబ్దాల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. తన సతీమణి సారా అబ్దుల్లాతో విడిపోయారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సచిన్ పైలట్ దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌లో ఈ వివరాలు పొందుపరిచారు.
సారా అబ్దుల్లా మరెవరో కాదు.. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్ సి) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా కుమార్తె, ఒమర్ అబ్దుల్లా సోదరి. సచిన్ పైలట్, సారాల వివాహం 2004లో జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు( సారా ఆరన్ పైలట్, వెహాన్ పైలట్).
Sachin Pilot has admitted that he has divorced Sara Abdullah, daughter of Farooq Abdulla.For years there was a buzz that two were not getting along, in the nomination papers filed today,Pilot has given his martial status as divorced.@NewIndianXpress @santwana99 @Shahid_Faridi_ pic.twitter.com/twT900oLSe
— Rajesh Asnani (@asnaniraajesh) October 31, 2023
కాగా, సచిన్ పైలట్ రాజస్థాన్‌లోని టోంక్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. నవంబర్ 25న ఒకే దశలో రాజస్థాన్ ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
#BREAKING : Former Deputy Chief Minister of Rajasthan Sachin Pilot divorced Sara Abdullah. In an election affidavit, Sachin revealed that he is 'divorced'. #SachinPilot #SaraAbdullah #Congress #Tonk #Rajasthan pic.twitter.com/g2Ib2vMyAo
— Vikas Lohchab (@TheVikasLohchab) October 31, 2023
