వెండితో వనపర్తి రాజా వారి బంగ్లా

  • స్వర్ణకారుడు శ్రీకాంతాచారి ప్రతిభ

వనపర్తి, వెలుగు : వనపర్తి సంస్థానాధీశుడు. రాజా రామేశ్వరరావు నిర్మించిన చారిత్రక ప్రా శస్త్యం కలిగిన రాజా వారి బంగ్లా నమూనాను వనపర్తి పట్టణానికి చెందిన స్వర్ణకారుడు. గన్నోజు శ్రీకాంతాచారి వెండితో తయారు. చేసి శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇక్కడి రాజా వారి బంగ్లాలోనే 1959లో తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కృష్ణదేవరాయ పాలిటె క్నిక్ కాలేజీని ప్రారంభించారు.

ఈ బంగ్లాలో ఆది. చెన్నకేశవరెడ్డి తదితర సినిమాల షూటింగులు జరిగాయి. 50 గ్రాముల వెండితో 10 రోజులు కష్టపడి రాజా వారి బంగ్లాను రూపొందించినట్లు శ్రీకాంతాచారి తెలిపాడు. దీనిని చూసిన స్థానికులు స్వర్ణకారుడిని అభినందించారు.