అవసరం అయితే ఆ కంటెస్టెంట్ కోసం బిగ్ బాస్ షోకి వెళ్తా: రాజ్ తరుణ్

ప్రస్తుతం ప్రముఖ టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ "భలే ఉన్నాడే" చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ మనీష కందుకూరు నటించగా శివ సాయి వర్ధన్ రెడ్డి దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 13వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాషా చేసిన సహాయం గురించి స్పందించాడు.

అయితే రాజ్ తరుణ్ కొన్ని రోజుల క్రితం లావణ్య అనే యువతితో ప్రేమ పెళ్లి విషయాల్లో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో శేఖర్ భాషా తనకి సరైన సమయంలో ఆధారాలతో వచ్చి సహాయం చేశాడని చెప్పుకొచ్చాడు. అంతగాకుండా శేఖర్ భాషా నిజం కోసం నిలబడ్డాడని తనకోసం వీలైతే బిగ్ బాస్ కి వెళ్లి సపోర్ట్ చేస్తానని ఇంటర్వ్యూ తెలిపాడు.

ALSO READ | బిగ్ బాస్ 8వ సీజన్: రెండోవారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?

అయితే గతంలో పలు చిత్ర ప్రమోషన్స్ లో శేఖర్ భాషా ని ఒకట్రెండుసార్లు కలిశానని అంతేతప్ప తమ మధ్య ఎలాంటి ఫ్రెండ్షిప్ లేదని చెప్పుకొచ్చాడు. కానీ శేఖర్ భాషా మాత్రం తనకోసం ఎంతో చేశాడని దాంతో తనకి అత్యంత సన్నిహితుడుగా మారాడని పేర్కొన్నాడు.