Rainy Season: ముసురు పట్టిన వేళలో.... హాయి హాయిగా..

వర్షాకాలం వారంలో  దాదాపు ఐదు రోజులు ముసురు పడుతుంది.  మిగతా రోజుల్లో కూడా వాతావరణం చల్లగా ఉంటుంది.  ఇలాంటి సమయంలో వేడి వేడిగా ఏదైనా తినాలని... నిండా ముసుగుతన్ని వెచ్చగా పడుకోవాలని అనిపిస్తుంది. అది ఫీలింగ్ వరకయితే బాగనే ఉంటుంది, కానీ ఆఫీలింగ్​ లో మనసు  స్ట్రీట్ ఫుడ్ వైపు లాగుతుంది .  దాంతో ఆవురావురుమంటూ తినేస్తారు. అంతా బాగుంటే చల్లటి వాతావరణంలో, వెచ్చగా ఉన్న ఆ ఫీలింగ్​ను ఎంజాయ్ చేస్తారు. అందులో  -ఏమాత్రం తేడా చేసినా.. కొన్ని ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా తప్పించుకోవడం ఎవరి వల్లా కాదు.

 'వచ్చే వచ్చే వాన జల్లుల్లారా.. అని పాటలు పాడుకోవాలే గానీ.. ఈ గోలంతా మాకొద్దు అనుకుంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా తినే తిండిలో మార్పులు చేసుకుని, కాస్త జాగ్రత్తగా ఉంటే వాన పాటలు పాడుకోవచ్చు.

  • వెల్లుల్లి, మిరియాలు, అల్లం, ఇంగువ, జీలకర్రపొడి, పసుపు, ధనియాలు మీ ఆహారంలో తప్పక చేర్చుకోవాలి. ఇవిజీర్ణక్రియకు సంబంధించిన సమస్యలురాకుండా చేయడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి .
  •  కాచి చల్లార్చిన నీళ్లనే తాగాలి.
  •  ఓ మాదిరి మంచి తక్కువ ఉప్పు వాడిన ఆహారాన్ని మాత్రమే తినాలి. లేదంటే రక్తపోటు వారిన పడతారు వంట్లో నీరు చేరడం వంటి సమస్యలతో బాధపడాల్సివస్తుంది కూడా. 
  • నాన్ వెజిటేరియన్స్, లైట్​ గా  ఉండే మీటి స్ట్యూన్ సూప్స్ తాగాలి. చేప , రొయ్యలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చేపలు, మాంసం ఈ సీజన్లో తినకపోతేనే బెటర్. ఒకవేళ తిన్నా లిమిటీగా ఉండాలి. 
  • వేడివేడి పప్పు తినాలి. సూప్​ లు  తాగాలి. పసుపు, లవంగాలు, నల్ల మరియాలు, సోంపులను ఆహారంలో చేర్చడం. తప్పనిసరి.
  • వేడి వేడి సూప్స్ తాగితే ఒళ్లు నొప్పులు, ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండొచ్చు.
  • పచ్చి కూరగాయలు. అంటే సలాడ్స్ వంటివి తినే అలవాటు ఉంటే ఈ సీజన్లో మానుకోవాలి. మొలకెత్తిన గింజల వంటివి తింటే అజీర్ణం, గ్యాస్టిక్ సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది.
  • పసుపు మంచి యాంటీబయాటిక్ అనేది తెలిసిన విషయమే. అంతేకాదు ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. జీర్ణవ్యవస్థలో వచ్చే మంట వంటి సమస్యలను తగ్గించడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.
  • బ్రేక్​ ఫాస్ట్​, లంచ్, డిన్నర్.. ఇవి తిన్నాడ సోంపు నీళ్లను తాగితే జీర్ణక్రియకు మేలు చేస్తుంది. గ్యాస్టిక్ సమస్యలు రాకుండా ఉంటాయి. అబైడ్ ఉంటే కనుక వాటి. నుంచి ఉపశమనం కలుగుతుంది.